అసెంబ్లీ సెక్రటరీపై మంత్రి పొన్నం అసహనం !

-

అసెంబ్లీ సెక్రటరీపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ అసహనం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల వద్ద ఉన్న పాత అసెంబ్లీ పాసులను పరిశీలించారు పొన్నం ప్రభాకర్‌. ఇంకా పాత కార్డులనే కొనసాగించడంపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ఇంకెప్పుడు మారుస్తారంటూ సెక్రెటరీని ప్రశ్నించిన పొన్నం… అసహనం వ్యక్తం చేశారు.

Minister Ponna m Prabhakar expressed his displeasure with the Assembly Secretary

ఇక అటు ఈ తరుణంలోనే… అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ మాట్లాడారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ప్రసంగించారు. మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ. అభివృద్ధి, ప్రగతివైపు తెలంగాణ అడుగులు వేస్తోందని తెలిపారు. వరి రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. పేదలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తున్నామని… ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news