ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి విద్యార్థుల పరీక్షల షెడ్యూల్ ఖరారు అయింది. ఈ నెల 17వ తేదీ నుంచి అంటే ఎల్లుండి నుంచే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ తరుణంలోనే… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఈసారి ప్రత్యేకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

134 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు 25,723 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలు ఎటువంటి ఆటంకం కలగకుండా పకడ్బందీగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఆరు సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు గుర్తించారు. పరీక్షల నిర్వహణకు 1100 మంది ఇన్విజిలేటర్లు 10 స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు.
అటు నేటి నుంచి పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఇవాళ ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం.. ఆ పరీక్షలు ముగిసే వరకు మధ్యాహ్నం 1.15 నుంచి సా.5 గంటల వరకు తరగతులు ఉంటాయని అధికారులు ప్రకటన చేశారు.