తుమ్మిడి హట్టి ప్రాజెక్టును పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలసి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అక్కడి నీటిపారుదల శాఖాధికారులతో సంప్రదింపులు జరుపనున్నట్లు ఆయన వెల్లడించారు సోమవారం రోజున రాష్ట్ర శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు యం.కోదండరాం, జీవన్ రెడ్డి,తాతరావు,తీన్మార్ మల్లన్న తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాదానం చెబుతూ లెవల్స్ ను నిర్ణయించి తుమ్మిడి హట్టి ప్రాజెక్టుకు తుది రూపం ఇవ్వబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే నిధుల అంచనాలు పెరగడాన్నీ ఆయన వివరిస్తూ వర్జినల్ ప్రాధమిక ప్రాజెక్టు నివేదికలో డిస్ట్రిబ్యూటరీ నెట్ వర్క్స్ కు అవసరమైన భూమి తాలూకు వివరాలు పొందు పరచక పోవడమే కారణమన్నారు. అంతే గాకుండా అదే ప్రాధమిక నివేదికలో విద్యుత్ సబ్ స్టేషన్లకు అవసరమైన నిధులు కలపక పోవడంతో పాటు జి.ఎస్.టి 4 శాతం నుండి 8 శాతం పెరగడంతో అంచనాలు పెరిగాయని ఆయన తెలిపారు.