కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం రాత్రిబవళ్లు కష్టపడి, చదువుకుని ఖాళీగా ఉంటున్న వారికి రాజీవ్ యువవికాసం స్కీం కింద.. స్వయం ఉపాధికి ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ కార్యకర్తల కోసం రూ.6వేల కోట్లు కేటాయిస్తానని ప్రకటించారు.అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు తమ వెంట తిరిగిన కార్యకర్తలకు ఏదైనా చేయాలని నన్ను కోరారని చెప్పారు. అందుకే మన వెంట తిరిగిన కార్యకర్తలకు రూ.4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద డబ్బులు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. రెండు నెలల్లో ఈ డబ్బులు పంపిణీ చేస్తామన్నారు. ఇలా చేయడం వలన ప్రతి నియోజకవర్గంలో 4000 నుండి 5000 మందికి డబ్బులు వస్తాయని తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్
కాంగ్రెస్ కార్యకర్తల కోసం రూ.6000 కోట్లు ఇస్తా
మన వెంట తిరిగిన కార్యకర్తలకు రూ.4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద డబ్బులు ఇస్తాం
రెండు నెలల్లో ఈ డబ్బులు ఇస్తా
దీంతో ప్రతి నియోజకవర్గంలో 4000 నుండి 5000 మందికి డబ్బులు వస్తాయి – సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/wMp7vMj9sL
— Telugu Scribe (@TeluguScribe) March 18, 2025