బీసీ నేతలు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్. బలహీన వర్గాల లెక్క తేలాలి అని కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు. అభినందన నాకు కాదు… రాహుల్ గాంధీకి అందివ్వాలి. ఎవరు అడగక ముందే రాహుల్ గాంధీ కుల గణన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు…కుల గణన చేశాం. కుల గణన చేయడం తోపాటు అధికారంలోకి వస్తె.. రిజర్వేషన్ లు పెంచుతాం అని మాట ఇచ్చారు.
2021 లో జరగాల్సిన జనాభా లెక్కలు కూడా చేయలేదు కేంద్రం. చట్టబద్ధత లేని లెక్కలతో రిజర్వేషన్ పెంచలేము అని సుప్రీం కోర్టు చెప్పింది. అందుకే బీసీలు ఎంత మంది ఉన్నారో తేల్చేపని మనం చేశాం. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బీసీల సహకారంతో ప్రభుత్వం వచ్చింది. మీ సహకారం.. మేము ఏడాది లోనే అమలు చేశాం. ఫిబ్రవరి 4 సోషల్ జస్టిస్ డే గా ప్రకటించుకున్నాము అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.