ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రసిద్ధ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ కుమారుడు మృతి చెందారు. తాజాగా ఘంటసాల కుమారుడు మృతి చెందాడు. ప్రసిద్ధ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు రవి(72) కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

ఘంటసాలకు ఇద్దరు భార్యలు కాగా సరళతో ఆయనకు జన్మించిన కొడుకే రవి. ఆయన మరో భార్య పార్వతి ప్రముఖ భరతనాట్య కళాకారిణి. ఇక ప్రసిద్ధ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు రవి మృతి చెందిన తరుణం లోనే ఇండస్ట్రీలో ఉన్న ప్రాముఖ్యలు సంతాపం తెలుపుతున్నారు.