కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల మీద ఈడీ చార్జిషీట్ వేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పిలుపుమేరకు కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది.
ఈ క్రమంలోనే మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని చూసి మోడీ భయపడుతున్నారని, అందుకే ఈడీ కేసు వేశారన్నారు. 100 మంది మోడీలు వచ్చినా గాంధీ కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగించలేరు అని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని, బీసీల లెక్కతేల్చాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం వలన మోడీకి భయం పట్టుకుందని ఆయన ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు.గాంధీ కుటుంబానికి జైలు జీవితం కొత్త కాదని చెప్పుకొచ్చారు.