మహబూబాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

-

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్‌ డెడ్ అయ్యారు. గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని కొత్తగూడ మండల పరిధిలోని పెగడపల్లి వద్ద ఎదురుగా వస్తున్న ఆటో అతివేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఈ దుర్ఘటనలో ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news