జమ్ముకాశ్మీర్‌లోని టూరిస్టు స్పాట్ పహెల్గాం జిల్లాలో నలుగురు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 28 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కేంద్ర కేబినెట్ ఈ విషయంపై సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ హై కమిషనర్ కార్యాలయం నుంచి అధికారులను తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాక్ పౌరులకు దేశంలోకి అనుమతి నిరాకరించింది. సింధు జలాలపై ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
నేడు అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపునిచ్చింది.తాజాగా గురువారం ప్రధాని మోడీ మాట్లాడుతూ..టెర్రరిస్టులను,టెర్రరిస్టులకు సహాయం చేస్తున్న వారిని ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడిపై తమకు మద్దతుగా నిలిచిన ప్రపంచ దేశాల నాయకులకు,ప్రజలకు నా కృతఙ్ఞతలు అని పీఎం మోడీ అన్నారు. కాగా, పాక్ మీద మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేయాలని దేశప్రజలు డిమాండ్ చేస్తున్నారు.