సీఎం రేవంత్ రాక్షసకాండపై రాహుల్ గాంధీ మౌనం వీడాలి : ఎమ్మెల్సీ కవిత

-

రాష్ట్రంలో సీఎం రేవంత్ రాక్షస కాండపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మౌనం వీడాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.భారత్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ఏఐసీసీ అగ్రనేత హైదరాబాద్‌కు శనివారం రానున్నారు. ఈ క్రమంలనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘మోసపూరిత హామీలు..అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను నిండా ముంచి దారితప్పి రాష్ట్రానికి వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం’ అంటూ ఎద్దేవాచేశారు.రాష్ట్ర ప్రజలు సోనియాగాంధీ, మీ సోదరి ప్రియాంకా గాంధీతో పాటు మిమ్మల్ని నమ్మి అధికారమిస్తే ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తీవ్ర నిర్బంధం, అణచివేతను బహుమతిగా వారికి ఇచ్చారని విమర్శించారు.

ఎర్ర బుక్కు పట్టుకుని రాజ్యాంగాన్ని రక్షించాలని దేశమంతా తిరిగే మీరు రేవంత్ రెడ్డి తెలంగాణలో మానవ హక్కులను మంటకలుపుతూ దమనకాండ కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.మీ మౌనం దేనికి సంకేతం? అని నిలదీశారు.హెచ్‌సీయూలో పచ్చని అడవిని నాశనం చేశారని.. నిరసనకు దిగితే విద్యార్థులపై లాఠీల మోతలు, అక్రమ కేసులు, అరెస్టులు చేశారని.. హైదరాబాద్‌ పర్యటనలో రాహుల్ హెచ్‌సీయూను సందర్శించి లాఠీ దెబ్బలు తిని, వేధింపులకు గురైన విద్యార్థులను పరామర్శించాలని ఆమె డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news