రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. వరుసకు చెల్లి అని పిలుస్తునూ ఆమెపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో రేఖ అనే వివాహిత పక్కింట్లో ఉల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు.
రేఖ భర్త ఉద్యోగ నిమిత్తం దుబాయ్‌లో ఉన్నాడు. ఆమె అత్తమామ,తన పిల్లలతో కలిసి జీవిస్తున్నది. ఈక్రమంలోనే శ్రీకాంత్.. రేఖను చెల్లి అని పిలుస్తుండేవాడు.అతని భార్య పుట్టింటికి వెళ్లడంతో రేఖ ఒంటరిగా ఉన్న టైం చూసి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు ప్రతిఘటించటంతో కొడవలితో ఆమెను నరికి చంపాడు. అనంతరం భయంతో తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.