తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ బోర్డర్లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.శనివారం ఉదయం కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ జరగగా.. సుమారు 38 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్రెగుట్టలో భద్రతా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి.
దీనికి తోడు హెలికాఫ్టర్లతో కర్రెగుట్టపై భద్రత దళాల కాల్పులు జరిపినట్లు తెలిసింది. అధునాతన ఆయుధాలు సాటిలైట్స్, డ్రోన్స్‌ను ఉపయోగిస్తూ మావోయిస్టులపై పైనుంచి భద్రత దళాలు బాంబుల వర్షం కురిపించినిట్లు తెలిసింది. ఈ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుండగా.. కర్రెగుట్టలో మావోయిస్టులను మూడువైపులా భద్రత దళాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కోసం దాదాపు 10 వేల మంది భద్రతా బలగాలు మోహరించి ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం.