పాక్‌తో క్రికెట్ అస్సలే వద్దు.. ఇక సహించేది లేదు : సౌరవ్ గంగూలీ

-

జమ్ముకాశ్మీర్‌లోని పహెల్గాం జిల్లాలో 26 మంది టూరిస్టులను పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఘాటుగా స్పందించారు. ముందుగా ఈ ఘటనను ఖండించిన ఆయన.. పాకిస్తాన్‌తో ఇకపై మ్యాచులు ఆడేది లేదని స్పష్టంచేశారు.

పాకిస్తాన్‌తో భారత్ క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని బీసీసీఐకి సూచించారు. ఉగ్రదాడులు ఏటా జరుగుతున్నాయి. ఇది జోక్ కాదు. టెర్రరిజాన్ని సహించేది లేదని తెలిపారు. కాగా, 2013లో చివరిసారిగగా పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడిన భారత్.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం హైబ్రిడ్ మోడల్లో తటస్థ వేదికలలో మ్యాచులు ఆడుతోంది. కాగా, ఇప్పటికే బీసీసీఐ సైతం పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్ లను పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news