దేనికైనా రెడీ… చూసుకుందామన్నారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎట్టకేలకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నోరు విప్పారు. ఉగ్రవాదులకు తగిన విధంగా బుద్ధి చెబుతామని ఇప్పటికే భారత ప్రధాని మోదీ హెచ్చరించారు.

దీనిపై స్పందించిన షెహబాజ్ షరీఫ్.. జరగబోయే దాడిని ఎదుర్కొంటామని పేర్కొన్నారు. పహల్గామ్ దాడికి సంబంధించి తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై పారదర్శక విచారణకు తాము సిద్ధంగా ఉన్నట్లు షెహబాజ్ షరీఫ్ వెల్లడించాారు.