సయ్యద్ హుస్సేన్ షా కూడా అమరుడే.. ఉగ్రదాడిలో జాతి, మతం మాట్లాడొద్దు : ఏక్‌నాథ్ షిండే

-

జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన సయ్యద్ హుస్సేన్ షా జాతి,మతం గురించి మాట్లాడకూడదని బీజేపీ మిత్రపక్షం శివసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన సయ్యద్ హుస్సేన్ షా కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం, ఇల్లు కట్టిస్తామని శివసేన పార్టీ తరపున హామీ ఇచ్చినట్లు మీడియాకు వివరించారు.

పర్యాటకులను కాపాడడానికి వెళ్ళి సయ్యద్ హుస్సేన్ షా కూడా మరణించాడని.. అప్పుడు ఆయన కూడా అమరుడే అని అన్నారు.ఉగ్రవాదుల నుండి గన్ లాక్కుని పర్యాటకులను కాపాడేందుకు ప్రయత్నించే ప్రయత్నంలో సయ్యద్ హుస్సేన్ షా మరణించాడన్నారు. తాము వాళ్ల కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళినపుడు వారి ఆర్థిక పరిస్థితి, ఇల్లు చూసి బాధేసింది.సంపాదించే ఒక్క కొడుకు చనిపోయాడని వాళ్ల కుటుంబ సభ్యులు బాధపడ్డారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news