వరంగల్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రమాదం తప్పిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు రక్షణ కల్పించడానికి పోలీసులు ఎందుకు లేరని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న సభలో కేసీఆర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. సాయంత్రం 5 గంటల నుంచి ఏ ఒక్క పోలీస్ అందుబాటులో లేరు.
లక్షలాది మంది ప్రజలు వస్తే.. కేవలం నలుగురు మాత్రమే పోలీసులున్నారు. కేసీఆర్‌కు ఏమైనా జరిగి ఉంటే బాధ్యత ఎవరిది?’ అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సీఎం రేవంత్ సర్కారును ప్రశ్నించారు.ఇదిలాఉండగా,సభకు వెళ్లే వాహనాలను అడ్డుకునేందుకు పోలీసులు వస్తారని.. ప్రొటెక్షన్ కల్పించడానికి మాత్రం పోలీసులు ఎందుకు రాలేదని గులాబీ శ్రేణులు ప్రభుత్వాన్నినిలదీస్తున్నారు.