రాష్ట్ర పౌరసరఫరాలు, భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మంగళవారం సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. ‘నీకు దమ్ముంటే గత యాసంగిలో, ఈ యాసంగిలో ఎంత పంట కొన్నావ్? అలాగే మొన్న వానాకాలంలో ఎంత పంట కొని రైతుల ఖాతాల్లో డబ్బులు వేశావ్?
ఈరోజు వరకు ఎంత ధాన్యం కొన్నాడో లెక్క చెప్పమనండి?’ అని నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను, రైతులను మోసం చేస్తున్నదని ఆరోపించారు. యాసంగి పంట కొనుగోలు చేయకపోవడంతో రైతులు కళ్లాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. అకాల వర్షాలకు ధాన్యం తడిచి ముద్దవుతోందని ఫలితంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.