రేవంత్ ప్రభుత్వం చేసిన బదిలీల్లో భాగంగా జీహెచ్ఎంసీ నూతన కమిషనర్గా ఆర్వీ కర్ణన్ నియమితులైన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నూతన కమిషనర్గా ఐఏఎస్ అధికారి ఆర్వీ కర్ణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
గతంలో రాష్ట్ర ఆహార భద్రతా శాఖ కమిషనర్గా విస్తృత తనిఖీలు నిర్వహించిన కర్ణన్.. మాజీ కమిషనర్ ఇలంబర్తి స్థానంలో నియమితులయ్యారు. ఆహార భద్రతలో కఠిన చర్యలకు ప్రసిద్ధి గడించిన ఆయన, జీహెచ్ఎంసీలో సమర్థవంతమైన పాలన అందిస్తారని గ్రేటర్ వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేయని బ్యూరోక్రాట్లను తప్పించి.. సమర్థులకు పదవీ బాధ్యతలు అప్పగించింది.