జమ్ముకాశ్మీర్‌లోని పహెల్గాం ఉగ్రదాడిలో అమాయకులైన 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ సర్కార్ పాకిస్తాన్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశం మీద కఠిన ఆంక్షలు విధించింది. దీనికి తోడు యుద్ద సన్నాహాలు చేస్తున్నది.
ఈ క్రమంలోనే పాకిస్తాన్ తీవ్ర భయాందోళనకు గురవుతోంది. బోర్డర్‌కు పాక్ ఆర్మీని, రాడార్లను తరలిస్తున్నది. తాజాగా పాక్ మంత్రి అత్తావుల్లా తరార్ భారత్ తమపై 24 గంటల్లో దాడి చేస్తుందని కీలక వ్యాక్యలు చేశారు. దీనిపై తమకు విశ్వసనీయ సమాచారం ఉందని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. పహెల్గాం ఘటనలో పాక్ హస్తముందని భారత్ నిరాధార ఆరోపణలు చేస్తున్నదని అన్నారు. టెర్రరిజానికి తాము కూడా బాధితులమేనని పేర్కొన్నారు. కానీ, తమను ఇండియా ఏకపక్షంగా దోషులుగా తేల్చేసిందన్నారు. ఎలాంటి మిలిటరీ దాడినైనా ప్రతిఘటిస్తామని స్పష్టంచేశారు.