ఏపీలో సింహాచలం అప్పన్న ఆలయం ప్రహారి కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. గోడ కూలి భక్తులు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.
ఏపీలోని సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి భక్తులు మరణించిన ఘటన తనకు తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు.అలాగే వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ని తెలియజేస్తూ.. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని రాసుకొచ్చారు. ఇదిలాఉండగా, సింహచలం అప్పన్న సన్నిధిలోని చందనోత్సవంలో అర్థరాత్రి కురిసిన భారీ వర్షానికి రూ.300 టికెట్ క్యూ కాంప్లెక్స్ వద్ద గల 20 అడుగుల సిమెంట్ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది.