తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఇప్పటికే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురిసినా ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండకపోవచ్చని పేర్కొనడం గమనార్హం.మరోవైపు ఏపీలోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి.ఆదివారం ఉదయం విజయవాడలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది.ధాన్యం కొనుగోలు సమయంలో వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు.