చార్ధామ్ యాత్రలో ముఖ్యమైన మరో యాత్ర బద్రీనాథ్.. ఈ టెంపుల్ ఆలయ ద్వారాలు నేడు తెరుచుకున్నాయి. ఉదయం సరిగ్గా 6 గంటలకు ఆలయ తలుపులను నిర్వాహకులు తెరిచారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌పై నుంచి భక్తులపై పుష్పవర్షం కురిపించారు. బద్రీనాథ్ తలుపులు తెరిచిన వెంటనే గత ఆరు నెలలుగా వెలుగుతున్న అఖండ జ్యోతిని చూసేందుకు దేశ, విదేశాల నుంచి దాదాపు 10 వేలకు పైగా భక్తులు బద్రీనాథ్ ధామ్ చేరుకున్నారు.
నేడు ఆలయ ద్వారాలను తెరిచిన సందర్భంగా.. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. దాదాపు 40 క్వింటాళ్ల బంతి పువ్వులతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.ఇదిలాఉండగా, ఛార్‌దామ్ యాత్రలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు శుక్రవారం మే 2న ఉదయం 7 గంటలకు తెరుచుకున్న విషయం తెలిసిందే.దానికి ముందు అక్షయ తృతీయ రోజున అనగా ఏప్రిల్ 30న.. గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు సైతం తెరుచుకున్నాయి.