జమ్మూకశ్మీర్‌లో మరో ప్రమాదం.. లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. జవాన్లు మృతి

-

జమ్మూకశ్మీర్‌లో మరో ప్రమాదం జరిగి.. జవాన్లు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయ్. జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రంగభన్ జిల్లాలోని రాంభవ్ వద్ద 700 ఆడుగుల లోతైన లోయలో ఆర్మీ వాహనం పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

2 Soldiers Killed As Army Vehicle Falls Into Gorge In Jammu And Kashmir's Ramban
2 Soldiers Killed As Army Vehicle Falls Into Gorge In Jammu And Kashmir’s Ramban

జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

పిటిఐ కథనం ప్రకారం, జమ్మూ నుండి శ్రీనగర్‌కు జాతీయ రహదారి 44 వెంబడి వెళుతున్న కాన్వాయ్‌లో ఈ ట్రక్కు ఉంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బ్యాటరీ చష్మా సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నేపథ్యంలో భారత సైన్యం, జమ్మూ,కాశ్మీర్ పోలీసులు, సహాయక చర్యలను ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news