తెలంగాణ యూత్ కు బిగ్ అలెర్ట్. సిబిల్ స్కోర్ ఉంటేనే రాజీవ్ యువ వికాసం ఇచ్చేనందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఏవైనా లోన్లు తీసుకుని కట్టనివారి అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందన్న మాట. దరఖాస్తుదారుల లోన్ హిస్టరీ, సిబిల్ స్కోర్ వివరాలను బ్యాంకుల నుంచి సేకరించేందుకు చర్యలు చేపట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

వాటి ఆధారంగా 40% అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దింతో ఎంత మేరకు వాస్తవం ఉందొ లేదో తెలియాల్సి ఉంది.
- ‘రాజీవ్ యువ వికాసం’ పథకం.. విధివిధానాలు ఇవే
నిరుద్యోగుల కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం విధివిధానాలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
మొత్తం యూనిట్లలో 25 శాతం మహిళలకు కేటాయింపు
ఒంటరి, వితంతు మహిళలు, ఎస్సీ వర్గీకరణ పోరాటం, తెలంగాణ ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రాధాన్యం
వ్యవసాయ సంబంధిత ఉపాధి కోసం 60 ఏళ్లు, ఇతర ఉపాధికి 55 ఏళ్లను గరిష్ఠ వయోపరిమితిగా నిర్ణయం