భార్య ముక్కు అందంగా ఉందని ఓ భర్త కొరికేశాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లాలో చోటుచేసుకుంది. భార్య భర్తలు మధ్య గొడవలు అలాగే ప్రేమ నిత్యం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పెద్ద గొడవలు అయినా ఆ తర్వాత సర్దుకుంటాయి. మన ఇండియాలో.. ప్రతి ఇంట్లో జరిగేదే ఇది. భార్యాభర్తలు గొడవపడితేనే వాళ్లు కలకాలం కలిసి ఉంటారని ఒక వాదన కూడా ఉంది. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భార్య ముక్కు అందంగా ఉందని ఒక భర్త కొరికి సంచలనానికి తెర లేపాడు.

కోపంగా కొరికాడా లేదా అందంగా ఉందని కొరికాడో తెలియదు కానీ… మొత్తానికి అయితే ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నదియా జిల్లా శాంతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీర్ పారాలో భార్య మధు ముక్కు కొరికాడు బాపన్. నీ ముక్కు అందంగా ఉంది… అవకాశం దొరికితే కొరికి తినేస్తానని ఆ భర్త అనేవాడు. చివరకు అనంత పని చేశాడని తాజాగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది భార్య మధు. దీంతో ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.