ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతలపై దృష్టి సారించాలని.. 24 గంటలు పోలీసులు, అత్యసవర విభాగాల ఉద్యోగులు అందుబాటులో ఉండాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగరాన్ని నిఘా నీడలో ఉంచినట్లు సమాచారం.
ఓవైపు ఆపరేషన్ సిందూర్, మరోవైపు మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో హైదరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్‌లోని కీలక రక్షణ రంగ సంస్థల వద్ద భద్రతను భారీగా పెంచారు.మరోవైపు మిస్ వరల్డ్ పోటీల కోసం విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన అతిథులు బస చేసే హోటల్స్ వద్ద కేంద్ర బలగాలతో భారీ భద్రతను కల్పించారు. ఈ ఏర్పాట్లు అన్నింటినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భద్రతా ఏర్పాట్లను సీపీ సీవీ ఆనంద్ మానిటరింగ్ చేస్తున్నట్లు సమాచారం.