పాకిస్తాన్ వెళ్తున్నా.. నేనే యుద్ధాన్ని ఆపుతా : కేఏ పాల్

-

ఆపరేషన్ సిందూర్ కారణంగా భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ప్రజాశాంతి పార్టీ నాయకుడు కేఏ పాల్ మాట్లాడుతూ.. భారత్, పాక్ మధ్య యుద్ధం రాకుండా ఆపుతానని అన్నారు. అనంతపురంలో మీడియాతో ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలు జరుపుతున్నానని అందులో పేర్కొన్నారు. ఇటీవల రహస్యంగా మూడు రోజుల పాటు అమెరికాలో ఉన్న పెద్ద నాయకులను కలిసినట్లు వెల్లడించారు.

యుద్దాన్ని ఆపే శక్తి తనకే ఉందని వారు తనకు చెప్పారని..దాడుల నేపథ్యంలో మే 10న ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలను కలిసిన తర్వాత ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ యుద్ధం ఆపే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002లో తాను పాకిస్తాన్ వెళ్లానని గుర్తుచేశారు.భారత్ కేవలం టెర్రరిస్టులను మాత్రమే టార్గెట్ చేస్తోందని, సివిలియన్స్, పాక్ ఆర్మీని కాదని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news