పాక్ టు ఇండియా.. చొరబాటు దారుడిని కాల్చి చంపిన జవాన్లు

-

భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో సరిహద్దు రాష్ట్రాల్లో కేంద్రం హై అలర్ట్ జారీ చేసింది. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే కాల్చిపడేయాలని ఇప్పటికే సైన్యానికి ఆదేశాలు అందాయి. ఈ క్రమంలోనే భారత సరిహద్దులో ఓ అనుమానిత వ్యక్తి సంచరిస్తూ కనిపించాడు.

పాకిస్థాన్ నుంచి సరిహద్దు దాటి పంజాబ్ ఫిరోజ్‌పూర్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేసినట్లు సమాచారం. గత రాత్రి అంతర్జాతీయ బోర్డర్‌ను దాటేందుకు యత్నించగా.. అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చొరబాటుదారుడు మృతి చెందినట్లు సమాచారం. అనంతరం అతని మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. చొరబాటుదారుడి వద్ద పాకిస్థానీ వ్యవసాయానికి సంబంధించిన రసాయనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news