పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో సరిహద్దు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాత్రంతా వారు బిక్కుబిక్కుమంటూ గడిపినట్లు సమాచారం.అయితే, జమ్ముకాశ్మీర్లోని ఉరి సెక్టార్లో పాకిస్తాన్ సైన్యం నిన్న రాత్రి విచక్షణా రహితంగా దాడులకు తెగబడింది.
ఉరి సెక్టార్లో పాకిస్తాన్ సైన్యం జరిపిన దాడుల్లో పౌర ప్రాంతాలు కూడా లక్ష్యంగా చేసుకోబడ్డాయి.ఈ దాడుల్లో ఒకరు మహిళ మరణించగా, నలుగురు గాయపడ్డారని భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే, పౌరులపై పాక్ చేసిన దాడులకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.పాక్ సరిహద్దు పాంత్రాల్లో ఉన్న పౌరుల భద్రతపై కూడా భారత ప్రభుత్వం దృష్టి సారించింది. పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో పెద్దఎత్తున పౌరుల ఇల్లు ధ్వంసం అయ్యాయి.