Pithapuram: రెండో పెళ్లికి అడ్డుగా ఉందని 5 నెలల పసికందును చంపేసిన అమ్మ, అమ్మమ్మ

-

రెండో పెళ్లికి అడ్డుగా ఉందని 5 నెలల పసికందును చంపేసారు అమ్మ, అమ్మమ్మ. పిఠాపురం మండలం నరసింగపురానికి చెందిన శైలజ రెండేళ్ల క్రితం సతీష్ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది.

aunty
aunty

కొద్ది కాలం క్రితం తిరిగి ఇంటికొచ్చిన శైలజ, 5 నెలల క్రితం యశ్విత అనే పసిబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శైలజ మనసు మార్చి, తనకు తన కులంకి చెందిన వ్యక్తితో రెండో వివాహం జరిపించాలని శైలజ అమ్మ అన్నవరం నిర్ణయించింది.

దీనికి పాప యశ్విత అడ్డు తొలగించాలని, 5 నెలల పసికందును ఈ నెల 6న గొంతు నులిమి చంపేసి.. ఇంటి పక్కనే ఉన్న బావిలో పడేశారు. తర్వాత ఎవరో తమ ఇంటికి క్షుద్ర పూజలు చేసి చిన్నారిని చంపేశారని ఇంటి ముందు ముగ్గు వేసి, నిమ్మకాయలు పెట్టి నమ్మించారు. చివరకు పోలీసులు తమ రీతిలో విచారణ జరపగా చిన్నారిని తామే చంపినట్టు అమ్మ, అమ్మమ్మ ఒప్పుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news