ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. ఏపీలో మాజీ ఎంపీ మృతి చెందాడు. అనంతపురం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య(95) గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం బళ్లారిలో తన పొలాలను చూసుకునేందుకు వెళ్లిన ఆయన కారు దిగుతూ గుండెపోటుకు గురయ్యారు.

వెంటనే ఆయన సహచరులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన వైఎస్సార్ ప్రోద్భలంతో రాజకీయాల్లోకి వచ్చి చెరగని ముద్రవేశారు. ఇక నంతపురం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య(95) గుండెపోటుతో మృతి చెందిన తరుణంలోనే రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.