జగిత్యాల పర్యటనలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చేదు అనుభవం ఎదురు అయింది. జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోబోయాడు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వద్దంటూ వెనుకడుగు వేసాడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి.

మీ రాజ్యం మీరు ఏలండి ఇక మా పని అయిపోయిందంటూ పొంగులేటితో జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనికి సంభందించిన వీడియో వైరల్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత జీవన్ రెడ్డి… పార్టీకి క్రమక్రమంగా దూరమవుతున్నారు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే కీలక పదవులు ఇవ్వడంలో కూడా జీవన్ రెడ్డికి అన్యాయం జరుగుతోందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు కూడా అప్పట్లో చేశారు జీవన్ రెడ్డి.
జగిత్యాల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చేదు అనుభవం
జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోబోయిన మంత్రి పొంగులేటి
వద్దంటూ వెనుకడుగు వేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి
మీ రాజ్యం మీరు ఏలండి ఇక మా పని అయిపోయిందంటూ పొంగులేటితో జీవన్ రెడ్డి వ్యాఖ్యలు pic.twitter.com/DJbxHivLwU
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2025