అమెరికాకు గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పయనమయ్యారు. తమ కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికాకు బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. తన చిన్న కుమారుడు ఆర్యతో కలిసి బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కవిత విదేశీ పర్యటనకు అనుమతిచింది ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు.

ఈ నెల 23 వరకు అమెరికాలో పర్యటించడానికి అనుమతి ఇచ్చింది కోర్టు. ఇక కోర్టు ఇచ్చిన అనుమతి మేరకే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విదేశీ పర్యటనకు వెళ్లారు . ఈ నెల 23న తిరిగి హైదరాబాద్ కు వస్తారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది.