పాకిస్తాన్ స్పై… తెరపైకి జ్యోతితో పాటు మరో యువతి

-

పాకిస్తాన్ వర్సెస్ ఇండియా యుద్ధం నేపథ్యంలో…. శత్రు దేశానికి సహాయం చేస్తున్న చాలామంది వ్యక్తులను అరెస్టు చేస్తున్నారు ఇండియన్ ఆర్మీ అధికారులు. ఇందులో ముఖ్యంగా పాకిస్తాన్ కు గూఢచార్యం చేసిన కేసులో జ్యోతి మల్హోత్రా అరెస్టు అయ్యారు. ఇక ఈమెను ప్రస్తుతం విచారణ చేస్తున్న పోలీసులు షాకింగ్ నిజాలను రాబడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఒడిశా యూట్యూబర్ ప్రియాంకతో జ్యోతి కి మంచి స్నేహం ఉందని తెలుస్తోంది. దీంతో ఆమెను కూడా విచారించాలని.. అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత నాలుగు నెలల కిందట ప్రియాంక కూడా పాకిస్తాన్లో పర్యటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమెను విచారణ చేయబోతున్నారు అధికారులు.

ఇది ఇలా ఉండగా… పహల్గాం సంఘటనలో ఏకంగా 28 మంది.. మృతి చెందారు. ఈ సంఘటన నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టి పెట్టేందుకు ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది ఇండియన్ ఆర్మీ. ఈ నేపథ్యంలోనే మొత్తం 150కి పైగా ఉగ్రవాదులను మట్టు పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news