కన్నప్ప సినిమా బృందానికి బిగ్ షాక్ తగిలింది. కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్‌తో ఇద్దరు వ్యక్తులు పరారీ అయ్యారు. కన్నప్ప సినిమాకు చెందిన అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను, ఫిల్మ్ నగర్ లోని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు డీటీడీసీ కొరియర్ ద్వారా పంపింది ముంబాయి హెచ్ఐవీఈ స్టూడియోస్.

ఆ పార్సిల్ ను ఈ నెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకొని చరిత అనే మహిళకు అందించాడని, అప్పటి నుండి వారిద్దరు కనిపించడంలేదని తెలిపారు ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ ప్రతినిధులు. కొంత మంది పెద్దవాళ్ళు తమ సినిమాకు నష్టం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని, వారిద్దరిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ.