మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబై వెళ్లాల్సిన ఏఐ 180 అనే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయాణికులు అందరినీ కోల్కతాలోనే దించేసింది ఎయిర్ ఇండియా సిబ్బంది. అలాంటి సాంకేతిక సమస్య వచ్చినప్పుడు అలాగే ప్రయాణిస్తే ఖచ్చితంగా అహ్మదాబాద్ లాంటి ప్రమాదం జరిగే.. అవకాశం ఉందని గ్రహించిన ఎయిర్ ఇండియా సిబ్బంది… ప్రయాణికులను దించేశారు.

ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే ఆ సాంకేతిక సమస్య గురించి అధికారులు… ఆరాధిస్తున్నారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన తర్వాత ఇలా వరుసగా అన్ని విమానాలకు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. మొన్న రాత్రి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే విమానంలో కూడా చిన్నపాటి మంటలు కూడా వచ్చాయి. దీంతో విమానం ఎక్కాలంటే జనాలు భయపడిపోతున్నారు.