సినీ పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకరి తర్వాత మరొకరు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. దీంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోతోంది. ‘కాంటా లగా’ ఫేమ్ షఫాలీ ఇకలేరు. 2005లో వచ్చిన ‘కాంటా లగా’ రిమిక్స్ సాంగ్తో కుర్రకారును ఉర్రూతలూగించిన నటి షఫాలీ జరివాలా (42) గుండె పోటుతో మరణించారు.

శుక్రవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురికావడంతో వెంటనే భర్త పరాగ్ త్యాగి అంధేరిలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఆమెకు ఇన్స్టాలో 33 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.