11వ తరగతి విద్యార్థిపై మహిళా టీచర్ లైంగిక దాడి..రూంలోకి తీసుకెళ్లి మరీ!

-

11వ తరగతి విద్యార్థిని మహిళా టీచర్ లైంగికంగా వేధించారు. దింతో మహిళా టీచర్‌పై పోక్సో కేసు నమోదు అయింది. ముంబైలోని ప్రముఖ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడింది మహిళా టీచర్. 2023లో పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా గ్రూప్ డ్యాన్స్ కోసం సిద్ధం చేస్తున్న సమయంలో బాధిత విద్యార్థితో పరిచయం పెంచుకుంది మహిళా టీచర్.

ఆ తర్వాత టీచర్లు-విద్యార్థుల మధ్య ఇలాంటివి సహజమేనని ఆమె చెప్పి బాలుడిని పలు ఫైవ్ స్టార్ హోటళ్లకు తీసుకెళ్లిన మహిళా టీచర్… అలాగే బాలుడికి మద్యం కూడా తాగించింది. బాలుడు తీవ్ర ఆందోళనకు గురైతే, ఆందోళన తగ్గేందుకు మందులు ఇచ్చింది మహిళా టీచర్. కుమారుడి ప్రవర్తనలో మార్పును గమనించి ఆరా తీయగా, అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు తల్లిదండ్రులు.
బోర్డు ఎగ్జామ్స్ తర్వాత విద్యార్థి పాఠశాల నుంచి బయటకు వచ్చినా.. ఆ టీచర్ అతడిని కలిసేందుకు మళ్లీ ప్రయత్నించడంతో పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు. దింతో మహిళా టీచర్‌ను అరెస్ట్ చేసి, పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news