తెలంగాణ వాసులకు బిగ్ షాక్ అందజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ పెన్షన్ల ఏరివేతకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లుగా సమాచారం అందుతుంది. చనిపోయిన వ్యక్తుల పేర్లతో కొంతమంది పెన్షన్లు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు, నకిలీ సదరం సర్టిఫికెట్ తో పెన్షన్లు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. దీంతో ప్రభుత్వం అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్న వారిని అనర్హులుగా గుర్తించాలని నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేపట్టేలా కొంతమంది స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసింది. దీని ద్వారా అనర్హులను గుర్తించి పెన్షన్లు కట్ చేసే విధంగా చర్యలు చేపట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.