టాలీవుడ్ లో కలకలం. మూవీరూల్జ్, తమిళ్ ఎంవీ సైట్లకు పైరసీ మూవీలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఒక్కో మూవీని రూ.40వేలు-రూ.80 వేలకు అమ్ముతున్నట్లు సమాచారం అందుతోంది. సినిమా పైరసీ కేసులో అరెస్టైన కిరణ్ కుమార్ అనే వ్యక్తి వల్ల 2024లో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలకు రూ.3,700 కోట్లు నష్టం జరిగిందని సమాచారం అందుతోంది.

ఇప్పటి వరకు 65 సినిమాలను పైరసీ చేసినట్లు గుర్తించారు పోలీసులు. తన ఫోన్‌తోనే థియేటర్లో చిత్రం రికార్డ్ చేసి.. దానిని మూవీరూల్జ్, తమిళ్ ఎంవీ సైట్లకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈస్ట్ గోదావరికి చెందిన కిరణ్ వనస్థలిపురంలోని NGOs కాలనీలో ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు.