Ramayana Glimpse: రామాయణ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది..

-

 

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘రామాయణ’. ఈ సినిమాలో టాలీవుడ్ నటి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రం రామాయణ కావడం విశేషం. నితేష్ తివారి రామాయణ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ సినిమాలో రావణుడిగా యష్ నటించారు.

Ramayana Glimpse, Ramayana,
Ramayana Glimpse, Ramayana,

ఈ సినిమాలో బిజిఎం, విఎఫ్ఎక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 2026 దీపావళి సందర్భంగా రామాయణ సినిమా విడుదల కానుంది. 2027 దీపావళికి రెండవ భాగాన్ని కూడా రిలీజ్ చేయనున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. రామాయణ సినిమాకు హన్స్ జిమ్మేర్ & ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమా కోసం సాయి పల్లవి, రణబీర్ కపూర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news