టాలీవుడ్ స్టార్ హీరో నితిన్, అలాగే వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో వచ్చిన తాజా సినిమా తమ్ముడు. అయితే ఈ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి.. దుమ్ము లేపుతోంది. తమ్ముడు సినిమాలో వర్ష బుల్లెమ్మ అలాగే సప్తమి గౌడ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా ఇవాళ రిలీజ్ కావడంతో రకరకాల రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమా మొదటి పార్ట్ స్క్రీన్ ప్లే బాగాలేదని కొంతమంది అంటున్నారు.

ఎమోషనల్ సీన్లు కనెక్ట్ కాలేదని ఆడియన్స్ పేర్కొంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుందని గుర్తు చేస్తున్నారు. కామెడీ ఈ సినిమాకు చాలా ప్లస్ అవుతుందని వెల్లడిస్తున్నారు. యాక్షన్ సీన్లు అలాగే ప్రొడక్షన్ వాల్యూస్… బాగున్నాయని కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు అభిమానులు. ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ సినిమా స్వరూపం తేలనుంది.