ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఇకపై నెలకు 600 రూపాయలు ఇవ్వబోతున్నట్లు తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు దూరంగా ఉండటం వల్ల… విద్యార్థులకు రవాణా చార్జీలను చెల్లించాలని తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 47.19 కోట్లు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది.

వీటిని నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలలో జమ చేయబోతోంది సర్కార్. విద్యుత్ హక్కు చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు రవాణా చార్జీలలో భాగంగా నెలకు 600 రూపాయలు ఇవ్వనున్నారు. ఈ డబ్బులు మూడు నెలలకు ఒకసారి తల్లిదండ్రుల ఖాతాలలో జమ చేస్తారు. ఈ ప్రకటనతో విద్యార్థుల తల్లిదండ్రులకు భారీ ఊరట లభించనుంది.