ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే మహిళలకు బేబీ కిట్లు రానున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించిన వారికి ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్లను త్వరలోనే అందించనుంది. 2016లో ఈ పథకం ప్రవేశపెట్టగా మధ్యలోనే ఆగిపోయింది. మళ్లీ ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అనేక రకాల చర్యలను తీసుకుంటుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ పద్ధతిలో కిట్లు అందించేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది.

కిట్ లో దుస్తులు, దోమతెరతో కూడిన పరుపు, సబ్బు, పౌడర్, నాప్కిన్లు, ఆయిల్ తో సహా 11 రకాల వస్తువులను కిట్లలో అందించనున్నారు. దీంతో త్వరలోనే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించే వారికి ఈ కిట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో జిల్లా ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తోంది కూటమి ప్రభుత్వం. ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఈ జిల్లా ఏర్పాటుపై హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు.