కాంతారా సినిమా గురించి తెలియని వారు ఉండరు. తక్కువ బడ్జెట్ తో వచ్చి గ్రాండ్ హిట్ అందుకుంది కాంతారా. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హీరోగా చేశాడు. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం అన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి కీలక అప్డేట్ వచ్చింది.

కాంతారా చాప్టర్ 1 పేరుతో సీక్వెల్ వస్తోంది. అయితే ఈ సీక్వెల్ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్రం బృందం. ఈ సంవత్సరం అక్టోబర్ 2 అంటే దసరా కానుకగా.. ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. హోమ్ బలే సంస్థ నిర్మిస్తున్న.. ఈ సినిమాకు లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. కాగా 2022 లో విడుదలైన కాంతారా సినిమా గ్రాండ్ హిట్ కొట్టింది.