కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు జిల్లాలోని బనవాసి గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. చదువు ఇష్టం లేక ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని రిషిత బాత్రూంలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ సంఘటన వెనుక లవ్ ఎఫైర్ ఉందా? ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఎమ్మిగనూరులో బాలిక ఆత్మహత్య
చదువుకోవడం ఇష్టం లేక 16 ఏళ్ల యువతి (రిషితా) బాత్రూమ్ లో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
బనవాసి గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. pic.twitter.com/VyGVNRdyBZ
— greatandhra (@greatandhranews) July 7, 2025