కర్ణాటక రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య అలాగే డీకే శివకుమార్ పోటీపడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే చర్చ మొదలైంది. ఐదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సిద్ధరామయ్య తాజాగా ప్రకటించారు. డీకే శివకుమార్ సీఎం పదవి ఆశిస్తున్న మాట వాస్తవమే అంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.

కానీ నాయకత్వ మార్పు ఉండబోదని తేల్చి చెప్పారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. 2028 ఎన్నికల వరకు తానే సీఎం గా ఉంటానని ప్రకటించారు. నన్ను సీఎం పదవి నుంచి హైకమాండ్ తొలగిస్తుందన్న వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పారు. 2028 ఎన్నికల వరకు నేనే సీఎం గా ఉంటానని వివరించారు.