హైదరాబాద్ వాహనదారులకు అలెర్ట్. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ నెల 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.

ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని వాహణదారులకు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.