‘మెగా 157’ మూవీ పేరు ఇదేనా… అనిల్ రావిపూడి భారీ స్కెచ్

-

మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను గత కొద్దిరోజుల క్రితమే ప్రారంభించారు. ఈ సినిమాకు ‘మన శంకరవరప్రసాద్ గారు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా సినీ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అవుతుంది. దీనిపై చిత్ర బృందం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్ కాబట్టి సినిమా పేరును కూడా అదే ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది.

mega 157, chiranjevvi
mega 157, chiranjevvi

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. కాగా, ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా లేడీస్ సూపర్ స్టార్ నయనతార నటించనున్న సంగతి తెలిసిందే. సెకండ్ హీరోయిన్ ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో హీరో విక్టరీ వెంకటేష్ కీలక్ పాత్రను పోషించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని అనిల్ రావిపూడి నిర్ణయం తీసుకున్నారట. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news