JC Prabhakar Reddy visits Kethireddy’s house: తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేతిరెడ్డి కోడలు వైసీపీ సభకు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. తన అనుచరులతో కలిసి కేతిరెడ్డి ఇంటికి వెళ్లారు. పోలీసులు కలుగజేసుకొని జేసీ ప్రభాకర్‌రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

పోలీసుల జోక్యంతో జేసీ తిరిగి వెళ్లిపోయారు. కేతిరెడ్డి.. జేసీ సవాళ్లు ప్రతిసవాళ్లతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. తాడిపత్రిలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే. సమావేశానికి పెద్దారెడ్డి హాజరు కాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా..ఎందుకు అనుమతించారని పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.